Firefox

స్థలాన్ని-తెలుపుతూ అన్వేషణ

Firefox అనునది వెబ్‌సైటులకు మీరు యెచటవున్నారో తెలుపగలదు అలా మీరు మరింత సారూప్యమైన మరియు వుపయోగకరమైన సమాచారాన్ని కనుగొనగలరు. ఇది మీ గోప్యతకు భంగంవాటిల్లకుండా – వెబ్‌ను మరింత తెలివిగా వాడుకొనునట్లు చేస్తుంది. ప్రయత్నించి చూడండి!

తరచుగా అడుగు ప్రశ్నలు

స్థలాన్ని-తెలుపుతూ అన్వేషణ అంటే ఏమిటి?

స్థలాన్ని-తెలుపుతూ చేసే అన్వేషణను వుపయోగించే వెబ్‌సైటులు మీకు మరింత సమాచారము తెలియజెప్పుటకు, లేదా అన్వేషణలో మీ సమయం వృధా కాకుండా వుండుటకు మీరు యెక్కడ వున్నారో అడుగుతాయి. ఉదాహరణకు మీరు మీ ప్రాంతములోని పిజ్జా రెస్టారెంట్ కొరకు వెతుకుచున్నారు అనుకుందాం. వెబ్‌సైట్ మీరు వున్న చోటును చెప్పమని అడుగుతుంది కాబట్టి సులువుగా “పిజ్జా” కొరకు వెతికితేచాలు మీకు కావలసిన సమాధానాలను యిస్తుంది...ఎటువంటి యితర సమాచారము లేదా అదనపు టైపింగ్ అవసరము లేకుండా.

లేదా, మీరు యెక్కడికో వెళ్ళటానికి మార్గాలను చూస్తుంటే, మీరు యెక్కడనుండి ప్రారంభమౌతున్నారో వెబ్‌సైటు తెలుసుకుంటుంది మీరు చేయవలసినదల్లా యెక్కడికి వెళ్ళాలో దానికి చెప్పడమే.

ఈ సేవ పూర్తిగా నీ యిష్టానుసారం – Firefox మీ స్థానాన్ని మీ అనుమతి లేకుండా పంచుకోదు – మరియు దానిని మీ గోప్యతకు భంగంవాటిల్లకుండా చేస్తుంది. మరియు, యితర Firefox మూలకాలవలె, వెబ్ అభివృద్దికారులు సులువుగా అవలంబించుట కొరకు దీనిని బాహాటపరచిన ప్రమాణాలు వుపయోగించి నిర్మించబడమైంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

స్థలాన్నితెలుపుతూ చేసే అన్వేషణను వుపయోగించే వెబ్‌సైటును మీరు దర్శించినప్పుడు, మీరు మీ స్థలాన్ని తెలుపగోరుచున్నారా అని Firefox అడుగుతుంది.

మీకు అంగీకారమైతే, Firefox దగ్గరలోని వైర్‌లెస్ యాక్సెస్‌ స్థానాలను మరియు మీ కంప్యూటరుయొక్క IP చిరునామాను సేకరిస్తుంది. అప్పుడు మీరున్న చోటుపై అంచానాకు వచ్చుటకు Firefox ఈ సమాచారాన్ని అప్రమేయ భౌగోళికస్థల సేవాదారి,Google Location Services కు పంపుతుంది. అప్పుడు అభ్యర్దించిన ఆ వెబ్‌సైటుకు అంచనా వేసిన స్థల సమాచారమును అందిస్తుంది.

మీరు అంగీకరించకపోతే, Firefox ఏమీ చేయదు.

స్థలములు ఎంత ఖచ్చితంగా అందుతాయి?

ఖచ్చితత్వము అనునది స్థలానికి స్థలానికి మారుతుంది. కొన్ని స్థానాలలో, మా సేవాదారులు కొన్ని మీటర్ల లోపలే స్థలాన్ని అందివ్వగలరు. ఇతర ప్రాంతాలలో యిది అంతకన్నా యెక్కువ వుండవచ్చును. మా సేవాదారులనుండి వచ్చిన అన్ని స్థలవివరములు కేవలం అంచనా మాత్రమే, మేము స్థలముయొక్క ఖచ్చితత్వముపై హామీ యిచ్చుటలేదు. దయచేసి ఈ సమాచారాన్ని అత్యవసరాలకు వుపయోగించవద్దు. ఎల్లప్పుడూ సాదారణ అవసరాలకే వుపయోగించుము.

ఏ సమాచారము పంపబడుతుంది, మరియు యెవరికి పంపబడుతుంది? ఎలా నా గోప్యత కాపాడబడుతుంది?

మిమ్ములను గోప్యంగా వుంచుట మాకెంతో ప్రధానము, మీ అనుమతి లేకుండా Firefox యెప్పుడూ స్థలసమాచారాన్ని పంచుకొనదు. మీ సమాచారాన్ని అభ్యర్ధించే పేజీను మీరు దర్శించినప్పుడు, ఆ సమాచారము వెబ్‌సైటు మరియు మా సేవాదారితో పంచుకొనుటకు ముందుగానే మీరు అడుగబడతారు.

అప్రమేయంగా, Firefox Google Location Services ఈ క్రింది వివరాలనుపంపి మీ స్థానాన్ని నిర్ణయిస్తుంది:

 • మీ కంప్యూటర్ యొక్క IP చిరునామా,
 • దగ్గరలోని వైర్‌లెస్ యాక్సెస్ పాయింట్స్ గురించిన సమాచారము, మరియు
 • గూగుల్ ద్వారా యివ్వబడే, యాదృచ్చిక క్లైంట్ గుర్తింపు, ప్రతి 2 వారాలకు దీని కాలం ముగుస్తుంది.

Firefox చేత సేకరించబడి వుపయోగించబడుతున్న సమాచారముయొక్క పూర్తి వివరణ కొరకు Firefox గోప్యతా విధానము ను చూడండి.

అప్పుడు గూగుల్ స్థల సేవలు మీ అంచనా వేసిన భౌగోళికస్థలము(ఉ.దా., అక్షాంశము మరియు రేఖాంశము)ను తెలియజెప్తాయి. గూగుల్ ద్వారా సేకరించబడి వుపయోగించబడుతున్న సమాచారముయొక్క పూర్తి వివరణ కొరకు, దయచేసి గూగుల్ భౌగోళికస్థల గోప్యతా విధానము ను చూడండి (ఆంగ్లములో).

మీ గోప్యతను రక్షించుటకు ఈ సమాచారము ఎన్క్రిప్టె‍డ్ అనుసంధానము ద్వారా మార్చుకొనబడుతుంది. ఒకసారి Firefox మీ స్థల సమాచారాన్ని పొందిన తర్వాత, అది ఆ సమాచారాన్ని అభ్యర్ధించిన వెబ్‌సైటుకు పంపుతుంది. మీరు దర్శించుచున్న వెబ్‌సైటు నామము లేదా స్థానముకాని, లేదా ఏదేనీ కుకీలు కాని, ఎప్పుడూ కూడా Google Location Services తో పంచుకోబడవు.

Google లేదా Mozilla ఏదీ కూడా Google Location Services ద్వారా సేకరించబడిన సమాచారాన్ని మీ పైన నిఘా వేయుటకు ఉపయోగించవు.

మీ స్థలముయొక్క సమాచారాన్ని అభ్యర్ధించిన వెబ్‌సైటు దానితో యేమిచేస్తుంది అనేదానిపై సమాచారము కొరకు, దయచేసి ఆ వెబ్‌సైటు గోప్యతా విధానాన్ని చూడండి.

మీ గోప్యత గురించి అధిక సమాచారము కొరకు, మీరు దీనిని కూడా చదువవచ్చు:

నేను వెబ్‌ను అన్వేషించుచున్నట్లు గమనించబడుతున్నానా?

లేదు. వెబ్‌సైటు అభ్యర్దించినప్పుడే Firefox మీ స్థలము కొరకు అభ్యర్దిస్తుంది, వినియోగదారి అభ్యర్ధనను అంగీకరించినప్పుడు మాత్రమే మీ స్థలము పంచుకొనబడుతుంది. మీరు అన్వేషించినప్పుడు మీ స్థలాన్ని Firefox గమనించదు లేదా గుర్తుంచుకోదు.

నేను వొక సైటుకు యిచ్చిన అనుమతిని వెనుకకు యెలా తీసుకొనగలను?

మీరు వొక సైటుకు యెల్లప్పుడూ మీ స్థానాన్ని తెలుపునట్లు Firefox అనుమతిని యిచ్చి తర్వాత మీ మనస్సు మార్చుకుంటే, మీరు సులువుగా ఆ అనుమతిని వెనుకకు తీసుకొనవచ్చు, ఎలాగో ఇక్కడ చూడండి:

 • మీరు దేనికైతే అనుమతిని యిచ్చారో ఆ సైటునకు వెళ్ళండి
 • సాధనములు మెనూకు వెళ్ళి, పేజీ సమాచారము యెంచుకొనండి
 • అనుమతులు టాబ్ యెంపికచేసి
 • స్థానాన్ని పంచుకొనుము దీని అమరికలను మార్చుము

స్థలాన్ని-తెలుపుతూ చేసే అన్వేషణను నేను శాశ్వతంగా యెలా ఆఫ్ చేయగలను?

స్థలాన్ని-తెలుపుతూ చేసే అన్వేషణ Firefox నందు యెల్లప్పుడూ ఎన్నుకొనబడే వుంటుంది. ఎటువంటి స్థల సమాచారము మీ అనుమతి లేకుండా యెప్పుడూ పంపబడదు. మీరు ఈ సౌలభ్యాన్ని శాశ్వతంగా అచేతనము చేయవలెనంటే, దయచేసి ఈ విధంగా చేయండి:

 • URL పట్టీనందు, about:config టైపు చేయండి
 • geo.enabled టైపు చేయండి
 • geo.enabled అభీష్టముపై రెండు సార్లు నొక్కండి
 • స్థలాన్ని-తెలుపుతూ చేసే అన్వేషణ యిప్పడు అచేతనమవుతుంది.

నా వెబ్సైట్ కు జియోలొకేషన్ మద్దతు ఎలా జోడించవచ్చు?

మీరు Mozilla Developer Center బోధన అనుసరించడం ద్వారా మీ సేవకు జియోస్థానం మద్దతు కలిపి అందించవచ్చు.